నా కుమారుడిని చంపేయండి: సోనీ కిడ్నాపర్ రవిశేఖర్ తల్లి!
- ఐదు రోజుల క్రితం సోనీ కిడ్నాప్
- రవిశేఖర్ కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- కొడుకు చేసిన పనితో తల తీసేసినట్లయిందన్న తల్లి
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని దావులూరు రవిశేఖర్ స్వగ్రామం కాగా, ఏడేళ్ల క్రితమే తన కొడుకు వెళ్లిపోయాడని, అప్పటి నుంచి తిరిగి తమ వద్దకు రాలేదని చెప్పిన చిట్టెమ్మ, ఆడపిల్లల జీవితాలతో వాడు ఆడుకుంటున్న విషయం టీవీల్లో చూసే తెలుసుకున్నామని, వాడిని వదిలి పెట్టొద్దని పోలీసులను కోరింది. గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్న తనకు సోదరుడు చేసిన పనితో తల కొట్టేసినట్లయిందని రవిశేఖర్ సోదరుడు వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అతను ఉన్నా, పోయినా తమకు ఒక్కటేనని అన్నాడు. రవిశేఖర్ కు అతని కుమారుడు రాజుకు సంబంధాలు లేవని, రాజును అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నాడు.