Ramcharan: మా గుర్రానికి ఓ పిల్ల పుట్టింది... ఏ పేరు పెట్టాలో చెప్పరూ..: ఉపాసన

షార్ట్స్‌లో చూడండి
సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రామ్ చరణ్ భార్య ఉపాసన, ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ వారిని సలహా అడిగింది. తాము పెంచుకుంటున్న గుర్రం 'ఫిల్లీ'కి ఆడ పిల్ల పుట్టింద‌ని, అది చాలా అందంగా ఉంద‌ని చెబుతూ తల్లీబిడ్డల ఫోటోను షేర్ చేసింది. పుట్టిన గుర్రానికి మంచి పేరు సూచించాలని కోరింది.

రామ్ కు, ఉప్పీకి జంతువులంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ గుర్రాన్ని రామ్ చిన్నప్పటి నుంచి పెంచుతున్నాడు. ఇక నెటిజన్లు దీనికి చాలా రకాల పేర్లను సూచించారు. కరుణ్, గ్రేసీ, రీనా, సనా, మిస్సీ, ఉడాన్, చెర్రీ, చిట్టి, ధ్రువ, మస్తంగ్... ఇలా ఎన్నో పేర్లు బయటకు వస్తున్నాయి.
Go Back to Shorts
Ramcharan
Upasana
Filly

More Telugu News