Andhra Pradesh: రాజన్న సారా దుకాణాలు రాబోతున్నాయి.. అకౌంటెంట్ గా విజయసాయిరెడ్డి ఉంటారేమో!: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. త్వరలోనే రాజన్న సారా దుకాణాలు రాబోతున్నాయనీ, వీటికి విజయసాయిరెడ్డి అకౌంటెంట్ గా ఉంటారేమో అని సెటైర్లు వేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది మద్యం అమ్మకాలపై రూ.2,297 కోట్ల ఆదాయం అధికంగా వచ్చిందని బుద్ధా వెంకన్న తెలిపారు.

కానీ విజయసాయిరెడ్డి లెక్కల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిపోయిందని వ్యాఖ్యానించారు. చూస్తుంటే విజయసాయిరెడ్డే మొత్తం మద్యం సేవించి ట్వీట్లు చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
RAJANNA
ACCOUNTANT
Vijay Sai Reddy
YSRCP
BUDDA VENKANNA
Telugudesam

More Telugu News