నేను నాలాగే వుంటాను .. ఎవరి కోసమో మారను: విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

నేను నాలాగే వుంటాను .. ఎవరి కోసమో మారను: విజయ్ దేవరకొండ

  • ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ కావడం ఇష్టం ఉండదు
  •  నాకు నచ్చిన కథలను చేస్తాను 
  • నాలా నేను ఉండటానికే ఇష్టపడతాను
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది విజయ్ దేవరకొండ మార్క్ సినిమాగానే ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ .. "ఈ కథకు విజయ్ దేవరకొండ అయితే సరిపోతాడు అనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు నా దగ్గరికి వస్తారు. ఆ కథల్లో నాకు నచ్చినవి నేను ఎంపిక చేసుకుంటాను.

ఇలాంటివి చేయవచ్చుగదా .. అలాంటివి చేయవచ్చుగదా అని చాలామంది నాకు సూచనలు చేస్తుంటారు. ఎవరినైనా సరే ఇలాగే ఉండాలి అని ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేయడం కరెక్ట్ కాదు. చిన్నప్పుడు అలాగే ఉండేవాడిని. ఎదుగుతున్న కొద్దీ కష్టాలు మొదలయ్యాయి. నా స్టైల్లోనే వాటితో యుద్ధం చేస్తూ వచ్చాను. ఆ కష్టాలే నన్ను మార్చేశాయి. నేను ఎలా ఉండాలనేది చెప్పాయి. ఇకపై ఇలాగే వుంటాను .. అది కొంతమందికి నచ్చచ్చు ..  మరికొంతమందికి నచ్చకపోవచ్చు. అయినా నేను నాలాగే వుంటాను" అని చెప్పుకొచ్చాడు. 
Vijay devarakonda

More Telugu News