Leopard: శునకాన్ని తరుముతూ ఇంట్లోకి చొరబడిన చిరుత.. గడియపెట్టిన ఇల్లాలు!

షార్ట్స్‌లో చూడండి
శునకాన్ని తరుముకుంటూ వచ్చిన చిరుతపులి ఓ ఇంట్లోకి చొరబడింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో జరిగిందీ ఘటన. బల్లార్‌పూర్‌లోని ఇటోలిలో ఓ చిరుతపులి కుక్కను తరుముకుంటూ వెంటబడడంతో చూసిన గ్రామస్థులు హడలిపోయారు. అది అలా తరుముకుంటూ లతాబాయి అనే మహిళ ఇంట్లోకి చొరబడింది. ఆ సమయంలో బయటే ఉన్న ఆమె భయపడకుండా బయటి నుంచి గడియపెట్టింది. ఆ వెంటనే అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించారు.

పోలీసులతో కలిసి లతాబాయి ఇంటికి చేరుకున్న అటవీ అధికారులు చిరుత తిరిగి దానంతట అదే అడవిలోకి వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఇంటి బయట వలలు అమర్చి పులిని బయటకు రప్పించేందుకు బాణసంచా కాల్చారు. దాదాపు 9 గంటల ప్రయత్నం తర్వాత శనివారం రాత్రి  ఇంటి నుంచి బయటకు వచ్చిన చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో అధికారులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
Go Back to Shorts
Leopard
Maharashtra
chandrapur
Dog

More Telugu News