టీమిండియా టెస్టు జట్టులో స్థానం నిలబెట్టుకున్న కాకినాడ కుర్రాడు
- విండీస్ టూర్ కు ఎంపికైన హనుమ విహారి
- ఇంగ్లాండ్, ఆసీస్ పర్యటనల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం
- ఆఫ్ స్పిన్ తోనూ ప్రభావం చూపగల సత్తా విహారి సొంతం
భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా సెలెక్టర్లు మరోసారి హనుమ విహారిపై నమ్మకం ఉంచారు. ఆఫ్ స్పిన్ కూడా ప్రభావవంతంగా వేయగల విహారి జట్టుకు సమతూకం తెస్తాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. కెరీర్ లో ఇప్పటివరకు విహారి 4 టెస్టులాడి 26 సగటుతో 132 పరుగులు చేయడమే కాకుండా 5 వికెట్లు కూడా తీశాడు. హనుమ విహారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ. క్రికెట్ కెరీర్ తొలినాళ్లలో హైదరాబాద్ రంజీ టీమ్ లో ఆడాడు. ప్రస్తుతం ఆంధ్రా రంజీ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.