Andhra Pradesh: అర్హత ఉండి అన్యాయం జరిగితే నేరుగా నన్ను కలవండి: మంత్రి పేర్ని నాని

షార్ట్స్‌లో చూడండి
అన్ని వ్యవస్థల్లోనూ అవినీతిపరులు ఉన్నారని, అంతమాత్రాన వ్యవస్థ మొత్తాన్ని తప్పుబట్టడం, అవినీతిని ఆపాదించడం సబబు కాదని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో ఆదాయం తెచ్చే శాఖల్లో రవాణా శాఖ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. ప్రమోషన్లు, బదిలీలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎవరికైనా అర్హత ఉండి అన్యాయం జరిగితే నేరుగా తనను కలవొచ్చని సూచించారు. ఇకపై నెలలో ఓ శుక్రవారం రవాణా ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టామని, దీనిపై అధికారుల్లో ప్రజల్లో అవగాహనా కల్పించాలని, జాతీయ రహదారిపై డ్రంకెన్ డ్రైవ్ ను విస్తృతం చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేశామని, రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Minister
perni Nani

More Telugu News