14 ఏళ్లు ప్రభుత్వం నడిపినప్పుడు ఏం చేశారు.. గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?: పీవీపీ ఆగ్రహం

  • టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ వైసీపీ నేత
  • ఇప్పుడేదో కుంభకర్ణుడిలా లేచి ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం
  • మళ్లీ నిద్రపోయిలేస్తే నవరత్నాల దీవెన కనిపిస్తుందని వ్యాఖ్య
వైసీపీ నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) టీడీపీ నేతలు లక్ష్యంగా మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, కేశినేని నాని చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని నిలదీశారు.

ఇప్పుడేదో కుంభకర్ణుడికి మెలకువ వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు మళ్లీ నిద్రపోయి లేచేటప్పటికీ ‘న భూతో న భవిష్యత్’ లాంటి  నవరత్నాల దీవెన, వైఎస్ జగన్ గారి పాలన కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన పీవీపీ..తన ట్వీట్ కు చంద్రబాబు, నారా లోకేశ్, కేశినేని నానిలను ట్యాగ్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
YSRCP
Kesineni Nani
Chandrababu
Nara Lokesh
pvp

More Telugu News