Jagan: షీలా దీక్షిత్ మృతికి సంతాపం తెలియజేసిన సీఎం జగన్

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. షీలా దీక్షిత్ మృతి వార్త తెలియడంతో తీవ్ర విచారానికి లోనైనట్టు ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ విషాదం నుంచి ఆమె కుటుంబం త్వరగా తేరుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా, 81 ఏళ్ల షీలా దీక్షిత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
Go Back to Shorts
Jagan
Sheila Dixit

More Telugu News