నేను తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్ర గాడిని కాదు!: వైసీపీ నేత పీవీపీ
- కేశినేని విమర్శలకు పీవీపీ కౌంటర్
- వేలకోట్లతో వ్యాపారం చేశామని వ్యాఖ్య
- వేలాది ఉద్యోగాలు సృష్టించామన్న పీవీపీ
తాను తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్రగాడిని కాదని పీవీపీ తెలిపారు. వేల కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేసి వేలాది ఉద్యోగాలను సృష్టించామని వ్యాఖ్యానించారు. వేల కోట్లు బ్యాంకులకు అప్పులను ఎగ్గొట్టడం ఎలాగో ‘మీ గురువు’ను అడగాలని కేశినేనికి సూచించారు. ఆ రహస్యాన్ని తమకూ చెబితే ఆ కొత్త బిజినెస్ నేర్చుకుంటామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు పీవీపీ ట్విట్టర్ లో స్పందించారు.