Andhra Pradesh: నిన్నటి దాకా చంద్రబాబు కాళ్లు.. రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్లు పట్టుకుంటావ్.. అంతే!: బుద్ధాకు కేశినేని నాని కౌంటర్

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల మధ్య ట్విట్టర్ లో చిన్నపాటి యుద్ధం నడుస్తోంది. నాలుగు ఓట్లు రాని వాడు నాలుగు పదవులు సంపాదించాడని విజయవాడ లోక్ సభ సభ్యుడు  కేశినేని నాని,  టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను విమర్శించారు. ఈ విమర్శలను తిప్పికొట్టిన వెంకన్న.. సంక్షోభంలో టీడీపీకి పార్టీని కాపాడేవాడు కావాలనీ, నీలా కూల్చేసేవాడు కాదని కౌంటర్ ఇచ్చారు.

దీంతో ఆ వ్యాఖ్యలపై కేశినేని నాని మరోసారి తీవ్రంగా స్పందించారు. కొందరు నిన్నటి దాకా చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారనీ, రేపటి నుంచి వైసీపీ నేత విజయసాయిరెడ్డి కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఇద్దరివీ కాళ్లు మాత్రమేననీ, వ్యక్తులు మాత్రమే తేడా అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేశినేని నాని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
budha venkanna
budda venkanna
YSRCP
Vijay Sai Reddy
Twitter
Kesineni Nani
Twitter war

More Telugu News