టీడీపీకి రాజీనామా చేసిన తరువాత తొలిసారి చంద్రబాబు ఇంటికి వెళ్లిన నాగం జనార్థన్ రెడ్డి!

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తరువాత మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి చంద్రబాబునాయుడితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ నేతగా ఉన్న ఆయన, బంజారాహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చి, చంద్రబాబుతో భేటీ అయి, దాదాపు అరగంట పాటు రాజకీయాలపై చర్చించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, నాగం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వీరిద్దరి మధ్యా ఏం చర్చలు జరిగాయన్న విషయమై అధికారిక సమాచారం లేదు. ఇదిలావుండగా, చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌ గౌడ్‌ తదితరులు కూడా కలిశారు.
Go Back to Shorts
Chandrababu
Nagam
Telangana
Telugudesam

More Telugu News