జగన్ గారు.. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న మీరు వ్యవస్థను ఎలా కడగగలరు?: కేశినేని నాని
- వ్యవస్థను సమూలంగా కడిగేద్దామన్న జగన్
- ముందు మనల్ని మనం కడుక్కోవాలన్న నాని
- కడిగిన ముత్యాలు మాత్రమే వ్యవస్థలను కడగగలవంటూ వ్యాఖ్య
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. 'వ్యవస్థను కడిగే ముందు మనల్ని మనం కడుక్కోవాలి జగన్ గారూ' అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కడిగిన మాత్యాలు మాత్రమే వ్యవస్థలను కడగగలవని అన్నారు. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న మీరు ఈ వ్యవస్థను ఎలా కడుగుతారంటూ ప్రశ్నించారు.