cm: సీఎం జగన్ పై కేశినేని నాని సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరతామమన్న సీఎం జగన్ పై టీడీపీ నేతల సెటైర్లు కొనసాగుతున్నాయి. తాజాగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. కేంద్రం మెడలు వంచి మరీ, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రూ.21 కోట్లు జగన్ సాధించడం చాలా గొప్ప విషయమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన 22 మంది ఎంపీలు చాలా గొప్పవాళ్లంటూ సెటైర్లు వేశారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపారని, ప్రత్యేక హోదా గురించిన ప్రస్తావనే లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడంతో టీడీపీ నేతలు జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Go Back to Shorts
cm
jagan
Telugudesam
mp
kesineni nani

More Telugu News