చార్‌ధామ్ యాత్రలో అపశ్రుతి... కర్నూల్ జిల్లాకు చెందిన భక్తురాలి మృతి
- యమునోత్రిలో కన్నుమూసిన కోడుమూరుకు చెందిన ధర్మాంబ
- శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో కన్నుమూత
- శివరాముడు ట్రావెల్స్ ద్వారా టూర్ వెళ్లిన గ్రామంలోని భక్తులు
ధర్మాంబ మృతి సమాచారంతో హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు. ఆమె మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మృతదేహాన్ని ఊరికి చేర్చడంలో ట్రావెల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వమే చొరవ తీసుకుని సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.