సారీ పోలీస్... పొరపాటున పెట్టాను, డిలీట్ చేశాను: గాయని చిన్మయి
- ఫేక్ పోస్ట్ పై స్పందించిన చిన్మయి
- అసలు వివరం చెప్పిన యూపీ పోలీసులు
- తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పిన చిన్మయి
ఇక ఈ ట్వీట్ వైరల్ కావడంతో యూపీ పోలీసులు స్పందించారు. ఇది ఎప్పుడో 2017లో జరిగిన ఘటనని, మూడేళ్ల తరువాత ఓ సెలబ్రిటీ గుర్తు చేయడం ఆమె బాధ్యతారాహిత్యమని అన్నారు. ఇది ఫేక్ న్యూస్ అని, అప్పట్లో ఎస్ఐపై విచారణ జరుపగా, అది అబద్ధమని తేలిందని స్పష్టం చేశారు. ఆమెపై అత్యాచారమే జరగలేదని చెబుతూ, రీట్వీట్ చేశారు. దీన్ని చూసిన చిన్మయి, తన తప్పు తెలుసుకుంది. తనను గుర్తించినందుకు ధన్యవాదాలని చెప్పింది. ఈ తరహా ఘటనలు తనకు తెలిస్తే, సోషల్ మీడియాలో పెడుతుంటానని, బాధితులకు న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని పేర్కొంది.