సీఎం జగన్ కు ప్రతిరోజూ లేఖ రాస్తా: అఖిలప్రియ

  • అధికారులు సీఎం మాటలు పట్టించుకోవడంలేదు
  • రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా నేరుగా జగన్ కే తెలియజేస్తాం
  • అక్రమకట్టడాలన్నీ కూలగొడితే స్వాగతిస్తాం
మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ తాజా పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి రహితపాలన అందిస్తామని జగన్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అధికారులెవరూ సీఎం మాటలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. అందుకే, ఇక నుంచి సీఎం జగన్ కు ప్రతిరోజు ఓ లేఖ రాస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చిన్న అవినీతి జరిగినా నేరుగా జగన్ కే లేఖల రూపంలో తెలియజేస్తామని అఖిలప్రియ తెలిపారు.

చంద్రబాబు నిర్మించారన్న కారణంతోనే ప్రజావేదికను కూలగొట్టడం సరికాదని, రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్రమకట్టడాన్ని కూలగొడితే తాము కూడా హర్షిస్తామని చెప్పారు. చంద్రబాబునాయుడు నివాసం పరిసరాల్లో అనాథాశ్రమాలు, ఆసుపత్రులు ఉన్నాయని వాటిని కూడా కూల్చివేస్తారా? అంటూ ప్రశ్నించారు. 
Go Back to Shorts
Jagan
Akhila Priya
Telugudesam
YSRCP

More Telugu News