yanamala: దుందుడుకు చర్యల ద్వారా రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెడుతున్నారు: యనమల

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. దుందుడుకు చర్యల ద్వారా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెడుతున్నారని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ... రాష్ట్ర అభివృద్ధిని, పేదల సంక్షేమాన్ని జగన్ నిలిపేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే బ్యాచ్ కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై వేసిన సబ్ కమిటీని ఆయన తప్పుబట్టారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డిలను సబ్ కమిటీలో వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
yanamala
jagan
Telugudesam
ysrcp

More Telugu News