విజయనిర్మల గారి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా!: పవన్ కల్యాణ్
- దర్శక-నిర్మాతగా సినీరంగంపై చెరగని ముద్రవేశారు
- చాలామంది మహిళా దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు
- ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా
విజయనిర్మల గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జనసేనాని చెప్పారు. ఈ సందర్భంగా విజయనిర్మల భర్త సూపర్ స్టార్ కృష్ణ, కుమారుడు నరేశ్ లకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు.