Kollywood: తంబీల అభిమానమంటే అంతే... విజయ్ పుట్టినరోజు సందర్భంగా బంగారపు ఉంగరాల పంపిణీ!

షార్ట్స్‌లో చూడండి
ఆవేశమైనా, ఆగ్రహమైనా, అభిమానమైనా... మనసులోని భావాన్ని వ్యక్తపరచడంతో తమిళులు ఎప్పుడూ ముందుంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లకు దేవాలయాలు కట్టి పూజలు జరిపించారు. జల్లికట్టు సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు కోట్లాది మంది కదిలొచ్చారు. ఇలా ఏ విషయంలోనైనా తమిళ తంబీల తీరే వేరుగా ఉంటుంది. ఇక తాజాగా హీరో విజయ్ 45వ పుట్టిన రోజు జరుపగా, వేలూరులో బంగారు ఉంగరాలను పంచిందో అభిమానసంఘం. పట్టణంలోని బస్టాండ్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చే, విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం, పూజలు చేసి, మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఆపై వేల్ మురుగన్ అధ్యక్షతన అభిమానులంతా పెట్ ల్యాండ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆ రోజు పుట్టిన శిశువులందరికీ ఉంగరాలు, దుస్తులు అందించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విజయ్ ఫ్యాన్స్ పాల్గొని తమలోని అభిమానాన్ని చాటారు.
Go Back to Shorts
Kollywood
Tamil
Veluru
Fans
Vijay
Birthday

More Telugu News