'ఈటీవీ' ప్రొడ్యూసర్, డైరెక్టర్‌నంటూ మోసాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్

  • వంశీ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు శ్రీలత అరెస్ట్
  • రూ.50 వేలు వసూలు చేసిందని ఫిర్యాదు
  • 2017లో మ్యాట్రిమోనీ పేరుతోనూ మోసం
సినిమాలు, సీరియళ్లలో నటించేందుకు అవకాశం కల్పిస్తామంటూ నకిలీ ఫేస్‌బుక్ ఖాతాతో మోసాలకు పాల్పడుతున్న శ్రీలత అనే మహిళను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. తుమ్మల శ్రీదేవి పేరుతో ఆమె నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించింది. తాను ఈటీవీ ఛానల్ ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ని అంటూ పలువురిని నమ్మించి మోసం చేసింది. వంశీ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీలతను అరెస్ట్ చేశారు. తన వద్ద నుంచి రూ.50 వేలు వసూలు చేసినట్టు వంశీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2017లోనూ శ్రీలత మ్యాట్రిమోనీ పేరుతో ఓ యువకుడిని మోసం చేసి అరెస్టైంది.
Go Back to Shorts
Sridevi
Sri Latha
Serials
Cyber Crime
Vamsi
Matrimony

More Telugu News