కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీతో మరికాసేపట్లో కేశినేని-గల్లా-రామ్మోహన్ నాయుడు భేటీ!
- పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో ప్రత్యేకంగా భేటీ
- టీడీపీ రాజ్యసభ పక్షం విలీనం చెల్లదని లేఖ
- వెంకయ్య నాయుడిని కూడా కలవనున్న నేతలు
అలాగే పార్టీ లెటర్ హెడ్ పై నలుగురు రాజ్యసభ సభ్యులు లేఖ ఇవ్వడంపై కూడా అభ్యంతరం చెబుతారని తెలుస్తోంది. ఈ విలీన ప్రక్రియ చెల్లదని ముగ్గురు టీడీపీ లోక్ సభ సభ్యులు వాదించబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే రాజ్యసభలో బీజేపీలో టీడీపీ విలీనం చెల్లందటూ వీరు చైర్మన్ వెంకయ్య నాయుడికి లేఖ ఇస్తారని పేర్కొన్నాయి. ఇందుకోసం తమకు కొంత సమయం ఇవ్వాలని ఆయనను కోరినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.