హీరో శర్వానంద్ భుజానికి శస్త్రచికిత్స... కాలు ఫ్రాక్చర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో శర్వానంద్ భుజానికి శస్త్రచికిత్స... కాలు ఫ్రాక్చర్!

  • హైదరాబాద్ కు చేరుకున్న శర్వానంద్
  • కదిలిన భుజం ఎముకకు రేపు ఆపరేషన్
  • నాలుగు రోజులు ఆసుపత్రిలోనే శర్వానంద్
బ్యాంకాక్ లో స్కై డైవింగ్ చేస్తూ, తీవ్ర గాయాలపాలైన నటుడు శర్వానంద్, అక్కడ స్వల్ప చికిత్స అనంతరం ఈ ఉదయం హైదరాబాద్ చేరుకుని, సన్ షైన్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. స్కై డైవింగ్ చేస్తుండగా, గాలి ఎక్కువగా వీచి ల్యాండింగ్ సమయంలో కింద పడటంతో భుజం ఎముక డిస్ లొకేట్ అయ్యిందని, కాలు ఫ్రాక్చర్ అయిందని వైద్యలు వెల్లడించారు. భుజానికి ఆపరేషన్ చేయాల్సివుందని, సోమవారం నాడు శస్త్రచికిత్స చేయనున్నామని, మరో నాలుగు రోజుల పాటు అతను ఆసుపత్రిలోనే ఉండాల్సివుందని స్పష్టం చేశారు. కాగా, శర్వానంద్ కు గాయాలు అయ్యాయని తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ను ఫోన్ లో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Sharwanand
Operation
Accident

More Telugu News