తల్లిదండ్రులంతా పిల్లలను స్కూలుకు పంపండి.. ఏటా రూ.15 వేలు అందుకోండి!: ఏపీ మంత్రి కొడాలి నాని
- ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోంది
- ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
- గుడివాడలో ‘రాజన్న బడిబాట’లో పాల్గొన్న నాని
కృష్ణా జిల్లా గుడివాడలోని ఏజీకే పాఠశాలలో ఈరోజు నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాలామంది విద్యార్థులతో మంత్రి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.