అమృత తన పరువును తీసిందన్న కసితో... వీలునామా రాసిన మారుతీరావు!
- గత సంవత్సరం ప్రణయ్ దారుణ హత్య
- కుమార్తెకు ఆస్తిలో వాటాలేదు
- అంతా తన స్వార్జితమేనన్న మారుతీరావు
మారుతీరావు వీలునామా రాసిన విషయాన్ని పోలీసులు తమ చార్జ్ షీట్ లో పొందుపరిచారు. దాదాపు 9 నెలల పాటు ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు సాగగా, తన ఏకైక కుమార్తె అమృత వర్షిణి, తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో, అతనిపై కోపం పెంచుకుని కోటి రూపాయల సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడని పోలీసులు తేల్చారు. ప్రణయ్ తో తాను తీసుకున్న వీడియోలను అమృత బంధుమిత్రులకు షేర్ చేయడం మారుతీరావులో అహంభావాన్ని పెంచిందని, అందరూ తనను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక, ఈ హత్యకు ప్లాన్ చేశాడని పేర్కొన్నారు.