వరల్డ్ కప్ లో 11వ జట్టు... ఈసారి వరుణుడిదే గెలుపట... సోషల్ మీడియాలో జోక్ ల వెల్లువ!
- సెటైరికల్ మీమ్స్ తో నిండిపోతున్న సోషల్ మీడియా
- ఇప్పటికే మూడు మ్యాచ్ లు వర్షార్పణం
- నేడు, రేపటి భారత్ మ్యాచ్ కూ వరుణుడి దెబ్బ!
కాగా, లండన్ పరిసరాల్లో రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. 7వ తేదీన పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్, సోమవారం నాడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్, నిన్న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే.
ఇక నేడు పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య, గురువారం నాడు భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీలు జరగాల్సివుండగా, వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తేల్చడంతో క్రికెట్ అభిమానులు అసహనానికి లోనవుతున్నారు. సెటైరిక్ల్ మీమ్స్ ను సోషల్ మీడియాలో పెట్టి జోకులు వదులుతున్నారు. మరో రెండు మూడు మ్యాచ్ లను వర్షం అడ్డుకుంటే, చాంపియన్ ఎవరో తేల్చాల్సిన అవసరం లేదని, ఆడకుండానే ఎవరో ఒకరు కప్పెత్తుకు పోతారని అంటున్నారు.