జస్ట్ మూడే మూడేళ్లు.. కడపలో ఉక్కు పరిశ్రమను ప్రారంభిస్తాం!: వైఎస్ అవినాశ్ రెడ్డి
- త్వరలోనే ఫ్యాక్టరీకి సీఎం జగన్ శంకుస్థాపన
- ప్రత్యేకహోదానే మా మొదటి అజెండా
- కడప జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ఎంపీ
ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో పార్లమెంటులో గట్టిగా గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. కడప జిల్లాలో అభివృద్ధి పనులపై అవినాశ్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. జిల్లాకు సాగు, తాగునీరు అందించే గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 12 నుంచి 26 టీఎంసీలకు పెంచుతామని అవినాశ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపను అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు.