Australia: వరుణుడు పొంచి ఉన్న నేపథ్యంలో వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న ఆసీస్

షార్ట్స్‌లో చూడండి
లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో 353 పరుగుల భారీ లక్ష్యం కళ్లముందు నిలుచున్నా, ఆసీస్ బ్యాట్స్ మెన్ జంకుగొంకు లేకుండా ధాటిగా ఆడుతున్నారు. ఓవైపు వరుణుడు పొంచివున్న నేపథ్యంలో వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 26 ఓవర్లలో 2 వికెట్లకు 139 పరుగులు. ప్రమాదకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ (56) అర్ధసెంచరీ సాధించిన అనంతరం మరింత ధాటిగా ఆడే ప్రయత్నంలో చాహల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

అంతకుముందు కెప్టెన్ ఫించ్ రనౌట్ గా వెనుదిరగడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే, లండన్ లో ఆకాశం మేఘావృతం కావడంతో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వరుణుడి కారణంగా మ్యాచ్ ఆగిపోతే డక్ వర్త్ లూయిస్ విధానం మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనుంది. దాంతో, రన్ రేట్ పెంచుకునేందుకు వీలుగా ప్రతి బంతికి పరుగులు తీయాలన్న లక్ష్యంతో ఆసీస్ వేగంగా ఆడుతోంది.
Go Back to Shorts
Australia
India
Cricket

More Telugu News