హాస్యాన్ని పండించడంలో దిట్ట కానీ స్క్రిప్ట్‌ను మాత్రం వడివేలు రాయలేరు: దర్శకుడు నవీన్
- నటన పరంగా వడివేలు అంటే చాలా ఇష్టం
- నటుడిగా నిజాయతీగా ఉంటారు
- భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి?
వడివేలు వ్యాఖ్యాలపై శింబు సహాయ దర్శకుడు నవీన్ స్పందించారు. సెట్‌లో నటన పరంగా వడివేలు అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఓ నటుడిగా నిజాయతీగా ఉండటమే కాకుండా హాస్యాన్ని పండించడంలో దిట్ట అని నవీన్ పేర్కొన్నారు. అయితే స్క్రిప్టును మాత్రం వడివేలు రాయలేరని వ్యాఖ్యానించారు. నిజానికి ‘ఇంసై అరసన్’ సినిమా విజయానికి వడివేలు కారణమైతే, ఆయన హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయని నవీన్ ప్రశ్నించారు.