Maharashtra: ప్రియుడి కోసం స్నేహితురాలి హత్య... భర్తను ఇరికించే ప్రయత్నం!

షార్ట్స్‌లో చూడండి
తన ప్రియుడిని వదిలి ఉండలేనని భావించిన ఓ యువతి, అతని సాయంతో తన స్నేహితురాలిని దారుణంగా హత్య చేయడంతో పాటు, తన ఆత్మహత్యగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ లో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, సోనాలీ షిండే (30) అనే యువతికి వివాహం కాగా, చబ్బాదాస్ వైష్టవ్ అనే వ్యక్తితో వివాహేతర బంధం ఉంది. అతనితోనే కలసి జీవించాలని భావించిన ఆమె, తాను ఆత్మహత్య చేసుకునేలా భర్త ప్రేరేపించినట్టు చూపించాలని భావించింది. ఇందుకోసం ఓ పథకం వేసింది.

ప్రియుడితో కలిసి తన స్నేహితురాలు రుక్మన్ బాయీ మాలీని హత్య చేసింది. ఆపై మృతదేహంపై ఉన్న దుస్తులను తీసేసి, తన దుస్తులు, చెప్పులు తొడిగింది. తన ఆభరణాలను ధరింపచేసింది. తన మృతికి భర్తే కారణమని, నిత్యమూ మద్యం తాగొచ్చి కొడుతుంటాడని రాసి, మృతదేహం పక్కనే సూసైడ్ నోట్ పడేసి వెళ్లింది. పోలీసులు మృతదేహాన్ని చూసిన తరువాత హత్యగా అనుమానించి విచారించగా, సోనాలీ కుట్ర బయటకు వచ్చింది. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Maharashtra
Lover
Deadbody
Husbend

More Telugu News