విజయ్ దేవరకొండ ఇలా చేశాడేంటబ్బా?
Add ap7am to your home Screen

విజయ్ దేవరకొండ ఇలా చేశాడేంటబ్బా?

  • రీసెంట్ గా వచ్చిన 'దొరసాని' ట్రైలర్ 
  • ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ పరిచయం
  • విజయ్ దేవరకొండ తీరుపై ఫ్యాన్స్ అసహనం  
తెలుగు యువ కథానాయకులలో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి విజయ్ దేవరకొండను సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు .. అందుకు కారణం 'దొరసాని' సినిమా. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో పరిచయమవుతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు.

ఈ ట్రైలర్ గురించి విజయ్ దేవరకొండ ఎంతమాత్రం స్పందించలేదు. ఆ తరువాత 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ పై విజయ్ దేవరకొండ వెంటనే స్పందించాడు .. షేర్ చేశాడు. దాంతో తమ్ముడి సినిమా ట్రైలర్ విషయంలో సైలెంట్ గా వుండిపోయి, వేరే వారి సినిమాను మోసే పనులేంటని ఫ్యాన్స్ ఆయనకి క్లాస్ తీసుకుంటున్నారు. ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలిమరి. 
vijay devarakonda

More Telugu News