jana sena: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ని కలిసిన ఎమ్మెల్యే రాపాక

షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నుంచి జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున శాస‌న‌స‌భ‌కు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈరోజు ఉదయం విజ‌య‌వాడ, ప‌డ‌మ‌ట లంక‌లోని ప‌వ‌న్‌ కల్యాణ్ స్వ‌గృహానికి వరప్రసాద్ వెళ్లారు. వ‌ర‌ప్ర‌సాద్‌ ని పవన్ సాద‌రంగా ఆహ్వానించి, అభినందనలు తెలిపారు. కాగా, తూర్పుగోదావ‌రి జిల్లా జనసేన పార్టీ అభ్య‌ర్థులతో పవన్ ఈరోజు స‌మీక్ష స‌మావేశం నిర్వహించనున్నారు.
Go Back to Shorts
jana sena
Pawan Kalyan
mla
rapaka

More Telugu News