fish venkat: చేపలు అమ్ముకునే నన్ను శ్రీహరి నటుడిని చేశారు: ఫిష్ వెంకట్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై సందడి చేస్తోన్న హాస్య నటుల్లో ఫిష్ వెంకట్ ఒకరు. ఎక్కువగా విలన్ గ్యాంగ్ లో కనిపిస్తూ .. కామెడీగా అనిపిస్తుంటాడు. అలాంటి ఫిష్ వెంకట్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తీరును గురించి ప్రస్తావించారు.

" హైదరాబాద్ లో మాది చేపల వ్యాపారం. అందువల్లనే నన్ను 'ఫిష్ వెంకట్' అని పిలుస్తుంటారు. ఈ వ్యాపారం చేస్తున్నప్పుడే నాకు శ్రీహరితో పరిచయమైంది. ఆయనతో నేను ఎంతో చనువుగా ఉండేవాడిని. ఆయనతో కలిసి షూటింగులకు వెళ్లేవాడిని. నువ్వు కూడా నటన వైపుకు వచ్చేయమని శ్రీహరి నాతో 'దాసన్న' .. 'ఒరేయ్ తమ్ముడు' సినిమాల్లో వేషాలు వేయించారు. ఆ తరువాత 'ఆది' సినిమాలో వేసిన పాత్ర నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. నన్ను నటుడిని చేసిన శ్రీహరికి నేను ఎప్పటికీ రుణపడి వుంటాను" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
fish venkat

More Telugu News