ఆయన చేతుల మీదుగా ఫస్టు చెక్ తీసుకోవడం విశేషం: హీరో కార్తికేయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆయన చేతుల మీదుగా ఫస్టు చెక్ తీసుకోవడం విశేషం: హీరో కార్తికేయ

  • కలైపులి థాను కాల్ చేశారు 
  • నాతో 'హిప్పీ' చేస్తున్నట్టు చెప్పారు
  • 10 లక్షలకి చెక్ ఇచ్చారు  
కార్తికేయ కథానాయకుడిగా రూపొందిన 'హిప్పీ' రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో కార్తికేయ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ కథ నాకు దర్శకుడు కృష్ణ వినిపించినప్పుడు ఓకే చెప్పాను. ఆ తరువాత చెన్నై నుంచి నిర్మాత కలైపులి థాను గారు కాల్ చేసేసరికి ఆశ్చర్యపోయాను.

'ఆర్ ఎక్స్ 100' సినిమా చూశానని చెప్పి థాను గారు మెచ్చుకున్నారు. నాతో మాట్లాడాలని చెప్పేసి టికెట్ బుక్ చేశారు. చెన్నై వెళ్లి ఆయనని కలుసుకుని మాట్లాడటం ఆనందాన్ని కలిగించింది. మనం 'హిప్పీ' చేస్తున్నాం .. అంతే' అంటూ అడ్వాన్స్ గా ఆయన 10 లక్షలకి 'చెక్' నా చేతిలో పెట్టారు. 'ఆర్ ఎక్స్ 100' మా సొంత సినిమా. అందువలన పారితోషికంగా నేను అందుకున్న ఫస్టు చెక్ ఇదే. అదీ కలైపులి థాను చేతుల మీదుగా అందుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చాడు.
karthikeya

More Telugu News