సయోధ్య కోసం రంగంలోకి గల్లా జయదేవ్.. విజయవాడలో కేశినేని నానితో భేటీ!
- టీడీపీలో ప్రాధాన్యతపై నాని అలక
- లోక్ సభ విప్ పదవి తిరస్కరణ
- ఎంపీగానే పోరాడుతానని స్పష్టీకరణ
పార్టీపై అలక వహించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ విషయమై కేశినేని నాని స్పందిస్తూ.. టీడీపీ విప్ తిరస్కరణ అంశాన్ని పెద్దదిగా చేసి చూపించవద్దని మీడియాను కోరారు. తాను విజయవాడ లోక్ సభ సభ్యుడిగానే లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టానని గుర్తుచేశారు. పోరాడేందుకు పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు. ఫేస్ బుక్ లో తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు.