Andhra Pradesh: రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు!: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.

ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ..‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలను ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. మీ ఆకాంక్షలన్నీ నెరవేరి ఆనందం మీ సొంతం కావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Nara Lokesh
Telugudesam
Twitter

More Telugu News