'మూగమనసులు' టైటిల్ తో మరో ప్రేమకథ
- 'జెర్సీ'తో గుర్తింపు తెచ్చుకున్న హరీశ్ కల్యాణ్
- దర్శకురాలిగా సౌజన్య పరిచయం
- త్వరలోనే సెట్స్ పైకి
సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సౌజన్య దర్శకత్వంలో ఒక ప్రేమకథ పట్టాలెక్కనుంది. ఈ సినిమా ద్వారానే సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానున్నారు. తాజాగా ఈ సినిమాకి 'మూగమనసులు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'జెర్సీ' ద్వారా పరిచయమైన హరీశ్ కల్యాణ్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. కథానాయిక ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.