తాను నిక్షేపంగానే ఉన్నానన్న సనత్ జయసూర్య!
- జయసూర్య చనిపోయాదంటూ వార్త వైరల్
- ఈ వార్తపై ఆరా తీసిన రవిచంద్రన్ అశ్విన్
- చివరికి స్పందించిన జయసూర్య
ఈ మేరకు అశ్విన్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘సనత్ జయసూర్య గురించి వచ్చిన వార్త నిజమేనా? అది వాట్సాప్ ద్వారా నాకు తెలిసింది. అయితే ట్విట్టర్‌లో ఎక్కడా ఆ ప్రస్తావన కనిపించలేదు’ అని ఆరా తీశాడు. దీనికి అశ్విన్ ఫాలోవర్లు ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. మరోపక్క, తాను చనిపోయానంటూ వస్తున్న వార్తలపై జయసూర్య కూడా స్పందించాడు. తాను బాగానే ఉన్నానని, తనకేం కాలేదని, ఇలాంటి తప్పుడు వార్తలతో తన కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దని కోరాడు.