చెన్నై ఆటో డ్రైవర్లకు భోజనాలు ఏర్పాటు చేసిన హీరో విజయ్
Add ap7am to your home Screen

చెన్నై ఆటో డ్రైవర్లకు భోజనాలు ఏర్పాటు చేసిన హీరో విజయ్

  • అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్
  •  మే 1న నిర్వహించవలసిన కార్యక్రమం
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు
ప్రస్తుతం విజయ్ .. అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగులో ఆయన బిజీగా వున్నాడు. అయినా ప్రతి ఏడాది తాను చేసే పనిని ఆయన మరిచిపోలేదు. ప్రతి ఏడాది కార్మిక దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని, మే 1వ తేదీన చెన్నైలోని ఆటో డ్రైవర్లందరికీ ఆయన లంచ్ ఏర్పాటు చేస్తుంటాడు.అయితే ఈసారి ఎన్నికల హడావిడి కారణంగా ఆ రోజున ఈ కార్యక్రమాన్ని జరపలేకపోయాడు. అందువలన తాజాగా ఆటో డ్రైవర్లందరికీ భోజనాలు ఏర్పాటు చేసేశాడు. షూటింగు కారణంగా విజయ్ రాలేకపోయాడు. కో ఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేలా విజయ్ చూసుకున్నాడని అంటున్నారు. ఆటో డ్రైవర్లంతా 'ఫుడ్ అదిరింది' అంటూ విజయ్ కి అంతా మంచి జరగాలని కోరుకుంటూ వెళ్లారట.
vijay

More Telugu News