‘జనసేన’ అధినేత పవన్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ ఫైర్!
- జగన్ గురించి ఓ వీధిరౌఢీలా వెలగపూడి మాట్లాడారు
- జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీనీ చిత్తుగా ఓడిస్తాం
- ప్రజలు పవన్ ను అసెంబ్లీ గడప తొక్కనివ్వలేదు
వెలగపూడికి దమ్ముంటే ఈ ఎన్నికల్లో తన సత్తా చూపించాలని సవాల్ విసిరారు. విశాఖ భూ కుంభకోణంలో పాత్రధారులను అవినీతి, అక్రమాలకు పాల్పడినవారినెవరినీ విడిచిపెట్టమని హెచ్చరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని జగన్ ని ఓడించాలని పవన్ పిలుపు నిచ్చారని మండిపడ్డారు. అందుకే, ప్రజలు పవన్ ను అసెంబ్లీ గడప తొక్కనివ్వకుండా చేశారని అన్నారు.