Aryan: సిద్దిపేటలో దారుణం.. తన ఇద్దరు చిన్నారులకు నోట్లో గుడ్డలు గుక్కి అత్యంత పాశవికంగా హత్య చేసిన తల్లి

  • ఆర్యన్(5), హర్షవర్థన్(2)లపై బీరు సీసాతో దాడి
  • హత్యానంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన తల్లి
  • భార్యాభర్తల మధ్య గొడవలే హత్యకు కారణం
కన్నతల్లే తన ఇద్దరు పిల్లల్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సిద్దిపేటలోని గణేశ్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దపేటలోని గణేశ్‌నగర్‌లో నివాసముంటున్న సరోజ తన ఇద్దరు పిల్లలు ఆర్యన్(5), హర్షవర్థన్(2)లను అత్యంత పాశవికంగా హత్య చేసింది.

చిన్నారులిద్దరికీ నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో ఒళ్లు గగుర్పొడిచేలా దాడి చేసి చంపేసింది. హత్యానంతరం వెళ్లి కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో సరోజ లొంగిపోయింది. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు. అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పిల్లల మృతదేహాలకు పంచనామా నిర్వహించారు.
Aryan
Harshavardhan
Saroja
Beer Bottle
Siddipet
Karimnagar

More Telugu News