ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లకు టీలు .. సిగరెట్లు అందించాను: హీరో యశ్
- మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం
- ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను
- నా ప్రయత్నాలు ఫలించాయి
"మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ఉండేది. అందుకే స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేరాను. ఆ దర్శకులకు టీలు .. సిగరెట్లు కూడా అందించాను. నేను ఏ పని చేస్తున్నా .. నేను అనుకున్న స్థానానికి ఎలా చేరుకోవాలనే విషయంపైనే దృష్టి ఉండేది. అదృష్టం బాగుండి నా ప్రయత్నాలు ఫలించాయి .. ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఇండస్ట్రీలో ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపు వుంది. ఇప్పుడు నేను చేయవలసిందల్లా గతంలో కంటే జాగ్రత్తగా ఉంటూ ఈ స్థానాన్ని కాపాడుకోవడమే" అని చెప్పుకొచ్చాడు.