నా క్లయింట్ రవిప్రకాశ్ గోడ దూకి పారిపోయింది అందుకే..!: సీనియర్ న్యాయవాది అహ్లూవాలియా

  • టీవీ9లోకి పోలీసులు వచ్చారు
  • వారు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలని చూశారు
  • అందుకనే పారిపోయారన్న అహ్లూవాలియా
ఇటీవల టీవీ9 స్టూడియోలోకి పోలీసులు వచ్చారని, వారు తన క్లయింట్, సంస్థ సీఈఓ రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతోనే ఆయన గోడ దూకి పారిపోయారని సుప్రీంకోర్టు న్యాయవాది, రవిప్రకాశ్ కు ముందస్తు బెయిల్ కోసం వాదనలు వినిపించేందుకు హైకోర్టుకు వచ్చిన అహ్లూవాలియా పేర్కొన్నారు. హైకోర్టు ముందుకు రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన వేళ, వాదనలు వినిపించేందుకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన అహ్లూవాలియా, తన క్లయింట్ పై పోలీసులు ఫోర్జరీ కేసు పెట్టారని గుర్తు చేశారు.

అవి ఫోర్జరీవో కావో తేల్చాల్సింది ఎన్సీఎల్టీయే తప్ప పోలీసులు కాదని వాదించారు. ఈ కేసులో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను తొక్కిపెట్టారని ఆరోపించిన ఆయన, తన క్లయింట్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఎటువంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ కేసులో రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
TV9
Raviprakash
Ahluwaliya
High Court
Interm Bail

More Telugu News