తెగిపోయిన లిఫ్ట్ వైర్... మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లికి గాయాలు!
- చిక్కడపల్లి హోటల్ లో ప్రమాదం
- గ్రౌండ్ ఫ్లోర్ కు రెండు అడుగుల ఎత్తున తెగిన వైర్
- కాలికి గాయంతో ఆసుపత్రిలో చికిత్స
గాంధీనగర్ కు చెందిన పార్టీ నేత ఎర్రం శ్రీనివాస్ గుప్తా కుమారుడి తొట్టెల కార్యక్రమానికి మైనంపల్లి వచ్చినట్టు తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ కు కేవలం రెండు అడుగుల ఎత్తులోనే వైర్ తెగడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మైనంపల్లి ఎడమకాలికి గాయమైందని వైద్యులు తెలిపారు. లిఫ్ట్ లో పరిమితికి మించి ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనంపల్లిని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు.