ట్రంప్‌కు ముంబైలోని ఇరాన్ ఎంబసీ వీడియోతో కౌంటర్
- ట్రంప్ ఒకసారి భారత్ వచ్చి చూడాలని సూచన
- భారతదేశంలో అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్‌కు తెలిసేలా వీడియో
- మహారాష్ట్రలోని భవనాలు, సుందర ప్రదేశాలను షేర్ చేసిన ఎంబసీ
భారతదేశంలోని అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్‌నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారతదేశ పర్యటనకు తీసుకువస్తే బాగుండేదని పోస్టులో పేర్కొంది. ఈ వీడియోలో మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.
మహారాష్ట్రలోని అత్యంత ఎత్తైన భవంతులు, ఆధునిక రహదారులు, వినాయక నిమజ్జనంను ఈ వీడియోలో పొందుపరిచింది. ఇంకోవైపు, కొండలు, కోనలు, వాగులు, వంకలతో అద్భుతమైన సుందర ప్రదేశాలు ఉన్నాయని పేర్కొంది.