Mahesh Babu: మరో మంచి కథను సిద్ధం చేయమని వంశీ పైడిపల్లితో చెప్పిన మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు తనకి హిట్ ఇచ్చిన దర్శకులను ఎంతమాత్రం వదులుకోడు. సాధ్యమైనంత త్వరలోనే ఆ దర్శకుడితో మరో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతాడు. 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో 'భరత్ అనే నేను' చేయడాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మహేశ్ బాబుకి 'మహర్షి' సినిమాతో వంశీ పైడిపల్లి భారీ విజయాన్ని అందించాడు.

ఈ సినిమా సక్సెస్ కావడమే కాదు, ఎమోషనల్ గా తనని ప్రేక్షకుల హృదయాలకి మరింత చేరువగా తీసుకెళ్లిందని మహేశ్ బాబు భావించాడు. అందువల్లనే తన కోసం మరో మంచి కథను సిద్ధం చేయమని వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. వంశీ పైడిపల్లి కథను సిద్ధం చేసేలోగా మహేశ్ బాబు తను ఇప్పటికే కమిటైన సినిమాలు చేసేస్తాడన్న మాట.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News