సామూహిక అత్యాచార బాధితురాలికి పోలీస్ ఉద్యోగం.. రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం!
- భర్త ఎదుటే వివాహితపై సామూహిక అత్యాచారం
- ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
- ఎన్నికల సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది.