Madhya Pradesh: కాంగ్రెస్ మైనార్టీలో పడింది.. అసెంబ్లీని సమావేశపరచండి!: మధ్యప్రదేశ్ గవర్నర్ కు బీజేపీ లేఖ

షార్ట్స్‌లో చూడండి
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పూర్తి మెజార్టీని కట్టబెట్టడంతో బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్నామన్న ఆత్మవిశ్వాసంతో... మిగిలిన రాష్ట్రాలలో అధికారం కోసం అప్పుడే బీజేపీ కార్యాచరణను మొదలు పెట్టింది. తొలి విడతగా మధ్యప్రదేశ్ లో ఆటను మొదలు పెట్టింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని పేర్కొంటూ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరింది.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించింది. 230 సీట్లు ఉండే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 116 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కు ఒక అడుగు దూరంలో కాంగ్రెస్ నిలిచిపోయింది. 114 సీట్లను సాధించిన కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీ (1), బీఎస్పీ (2), ఇండిపెండెంట్లు (4) సహకారంతో అధికారాన్ని చేపట్టింది. బీజేపీ 109 సీట్లను గెలుచుకుంది. ఆ విధంగా 15 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని చేపట్టింది.
Go Back to Shorts
Madhya Pradesh
bjp
congress
minotity
letter
governor

More Telugu News