శభాష్.. అంటూ పులివర్తి నానిని ప్రశంసించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు!
- ఏపీ సీఎంతో చంద్రగిరి అభ్యర్థి సమావేశం
- పోలింగ్ టీడీపీకే అనుకూలంగా జరిగిందని వివరణ
- ఏప్రిల్ 11 కంటే ఎక్కువ పోలింగ్ నమోదయిందని వ్యాఖ్య
ఎన్నార్ఎ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఇటీవల ఈసీ ఆదేశించింది. ఈ గ్రామాల్లో దళితులను ఓట్లేయనివ్వలేదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఐదు గ్రామాలతో పాటు కాలేపల్లి, కుప్పం బాదూరులో కూడా రీపోలింగ్ నిర్వహించాలన్న టీడీపీ నేతల డిమాండ్ కు ఈసీ అంగీకరించింది. మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల్లో నిన్న ఎన్నికలను సజావుగా నిర్వహించింది.