ఈ 24న అఖిల్ నాల్గొవ సినిమా ప్రారంభం
- 'బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్
- కైరా, రష్మికల పేర్లు పరిశీలన
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన లాంచ్ చేయనున్నారనేది తాజా సమాచారం. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్రకిగాను కైరా అద్వానీ .. రష్మిక మందన పేర్లను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ, ఎవరినీ ఇంకా ఖరారు చేయలేదట. అందువల్లనే ఫస్టు షెడ్యూల్లో అఖిల్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణనే ప్లాన్ చేశారట. రెండవ షెడ్యూల్ మొదలయ్యే సమయానికి హీరోయిన్ ను ఖాయం చేసే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.